కావలసిన పదార్థాలు:
జొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు
నీరు – 2 కప్పులు
మజ్జిగ – 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – కొద్దిగా
పచ్చిమిర్చి – 1 (సన్నగా తరిగినది)
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం:
జొన్న పిండిని కొద్దిగా నీటితో కలిపి ఉండలు లేకుండా కలపాలి.
మిగిలిన నీరు వేసి స్టవ్ మీద ఉంచి 5–7 నిమిషాలు ఉడికించాలి.
చల్లారిన తర్వాత మజ్జిగ, ఉప్పు కలపాలి.
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
చల్లగా సర్వ్ చేయాలి.
Leave a comment