
బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ ఆలూ పనీర్ టిక్కా స్నాక్ టైమ్‌కి సూపర్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు 👌
కావలసిన పదార్థాలు
పనీర్ – ½ కేజీ
బంగాళదుంపలు – 2
పచ్చిమిర్చి – 1
ఉప్పు – తగినంత
మైదా – ½ కప్
శనగపిండి – ¼ కప్
కారం – ½ tap
ఎండిన బ్రెడ్ ముక్కలు – 3
తాజా బ్రెడ్ ముక్కలు – 1½ కప్
రెడ్ క్యాప్సికం – 1
నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం
1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా మెదపాలి.
2. అందులో తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.
3. పనీర్‌ను చిన్న చతురస్ర ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. ఒక పాత్రలో మైదా, శనగపిండి, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి.
5. మరో పాత్రలో ఎండిన బ్రెడ్ పొడి, తాజా బ్రెడ్ ముక్కలు, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
6. బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
7. ఒక్కో ఉండను రెండు పనీర్ ముక్కల మధ్య పెట్టి స్వల్పంగా ఒత్తాలి.
8. వీటిని ముందుగా మైదా-శనగపిండి మిశ్రమంలో ముంచి, తరువాత బ్రెడ్ మిశ్రమంలో అద్దుకోవాలి.
9. పాన్‌లో నూనె వేడి చేసి టిక్కాలను మధ్య మంటపై గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.
10. చివరగా రెడ్ క్యాప్సికం ముక్కలతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.
టిప్స్ ✨
టిక్కా ఇంకా కరకరలాడాలంటే బ్రెడ్ క్రంబ్స్ రెండుసార్లు అద్దుకోవచ్చు.
టమోటా సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది 😋
Leave a comment