vantakambu

@golaj

కావలసిన పదార్థాలు:-

వంకాయలు – 250grams

జీడిపప్పు – 1/4 కప్పు

ఉల్లిగడ్డ తరుగు – 1 Tbsp

శెనగపిండి – 2 Tbsp

కారం, ఉప్పు – తగినంత

కరివేపాకు – 2 రెమ్మలు

జీలకర్ర పొడి – 1 Tsp

చింతపండు కొద్దిగా

కొత్తిమీర కొద్దిగా

వెల్లుల్లి- 4 రెబ్బలు

పసుపు – చిటికెడు


తయారీ విధానం:-
1.ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి నూనెలో వేగించాలి.

2.ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేయాలి. తర్వాత కొంచెం ఉల్లికారాన్ని మగ్గించిన వంకాయల్లో స్టఫ్ చేయాలి.

3.ఇప్పుడు మిగిలిన ఉల్లికారాన్ని శెనగపిండిలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ కలపాలి. పాన్లో నూనె వేడి చేసి స్టఫ్ చేసిన వంకాయలు, శెనగపిండి మిశ్రమం వేసి కాసేపు వేగించాలి.

4.ఆపై వేగించిన జీడిపప్పు, కరివేపాకులతో గార్నిష్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ.

వ్యాఖ్యానించండి