vantakambu

@golaj

కావలసిన పదార్థాలు:-
ముల్లంగి ముక్కలు – 1కప్
టమాటాలు – 3
చింతపండు – రుచికి సరిపడినంత
పచ్చిమిర్చి- 7
వెల్లుల్లి – 4 రెబ్బలు
ఉప్పు తగినంత
ఎండుమిర్చి – 2 లేదా 3
జీలకర్ర – 1 tsp
ఆవాలు – 1 tsp
శనగపప్పు -2 tsp
మినప్పప్పు – 2 tsp
కరివేపాకు – తాలింపు కోసం
నూనె – 3 స్పూన్లు

తయారు చేయు విధానము :-

1. ముందుగా ముల్లంగి ముక్కల్ని తక్కువ నీటిలో     పది నిమిషాలు ఉడికించి పక్కన ఉంచండి.

2.పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి టమోట వేయించండి. దించేముందు చింతపండు వేసి మంట తీసేయండి.

3. చల్లారిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర ,ఉప్పు కలిపి  మిక్సీలో గ్రైండ్ చేయండి.

4. దీనికి ఉడికించిన ముల్లంగి కలిపి కచ్చాపచ్చాగా రుబ్బండి.

5 ఇప్పుడు నూనెలో ఎండుమిర్చి తాలింపు గింజలు వేగించి మిశ్రమంలో కలిపి స్టవ్ ఆపి వేయండి.

6. ఈ పచ్చడి అన్నంలోకీ కాకుండా ఇడ్లీ దోసలాంటి టిఫిన్స్ తో కూడా బాగుంటుంది.

వ్యాఖ్యానించండి