కావలసిన పదార్థాలు:-

పాలు – 4 1/2 కప్
చక్కెర – 1/2 కప్
ఫలూదా సేమియా – 1/4 కప్
నానబెట్టిన సబ్జా గింజలు – 2tbsp
మొక్కజొన్నపిండి – 1 tbsp
రోజ్ సిరప్ – 4 tbsp
వెనిల్లా ఐస్ క్రీమ్ – 4 scoops
జీడిపప్పు,బాదం పలుకులు – రెండూ కలిపి 1/4 కప్

తయారీ విధానం:-

1.నాలుగుకప్పుల పాలను గిన్నెలో తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అవి మరుగుతున్న ప్పుడు సేమియా వేసి కలపాలి.

2.అయిదు నిమిషాల య్యాక మిగిలిన పాలల్లో మొక్కజొన్నపిండిని కలిపి మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇవి మరుగుతున్నప్పుడు చక్కెర కూడా వేసి కలిపి దింపేయాలి.

3.పాలు పూర్తిగా చల్లారాక రోజ్ సిరప్, సబ్జా గింజలు, డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి కలిపితే చాలు.

4.దీన్ని రెండు గంటలు ఫ్రిజ్లో పెట్టి… గ్లాసుల్లో పోసే ముందు వెనిల్లా ఐస్ క్రీమ్ అలంకరిస్తే సరిపోతుంది

వ్యాఖ్యానించండి