కావలసిన పదార్థాలు:-

పాయా – 4
ఉల్లి తరుగు – 1/2 కప్
తరిగిన పచ్చి మిర్చి – 6
టొమాటో తరుగు – 1/2 కప్
పసుపు – 1/2 tsp
ఉప్పు – తగినంత

కారం పొడి – 2 tsp
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – 1
లవంగాలు – 3
యాలక్కాయ్ – 2
జీలకర్ర పొడి – 1 tsp
ధనియాల పొడి – 1 tsp
నూనె –3 స్పూన్స్
అల్లం వెల్లుల్లి ముద్ద – 2 tsp
మిరియాల పొడి – 1 tsp
గరం మసాలా – 1/2 tsp
గసగసాలు – 1tsp
ఎండు కొబ్బరి తురుము – 1/2 కప్
కొత్తిమీర – చిన్న కట్ట
నిమ్మ రసం – 1 tsp
పుదీనాఆకులు – 1 కట్ట

తయారీ విధానం:-

1.పాయా ముక్కలను ఉప్పు, నిమ్మ రసంతో శుభ్రంగా కడగాలి

2.కొద్దిగా ఉప్పు, పసుపు చేసి బాగా కలిపి, మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి

3.మిక్సీలో గసగసాలు, ఎండు కొబ్బరి తురుము వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి

4.స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగిన తరవాత, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి

5 జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి

6.టొమాటో తరుగు వేసి బాగా కలిపిన తరవాత, మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం జత చేయాలి.

7.ఊరబెట్టిన పాయాను జత చేసి బాగా కలియబెట్టి, తగినన్ని నీళ్లు పోయాలి
8.మీడియా మంట మీద 7 నుంచీ 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.

8.ఉడికించిన తరవాత దింపేసి తరిగిన పుదీనా ఆకులతో అలంకరించాలి.

వ్యాఖ్యానించండి