సొరకాయ మంచూరియా

కావలసినవ పదార్థాలు:-

మంచూరియాలకోసం:
సారకాయ తురుము-1 కప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద -1/2 tsp
కారం- 1 tsp
గోధుమపిండి – 3 tbsp
మైదా -4 tbsp
కార్న్ ఫ్లోర్ – 1 tbsp
జీలకర్ర – 1/2 tsp
వంటసోడా – 1/4 tsp
ఉప్పుతగినంత


మంచూరియాలు వేయించేందుకు:-
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 1
ఉల్లికాడలు – 2
కరివేపాకు – 5 రెబ్బలు
కొత్తిమీర – తగినంత
చిల్లీసాస్ – 1tsp
టొమాటోసాస్ – 2 tsp
నూనె తగినంత

తయారుచేసే విధానం

1.సొరకాయ తొక్కు తీసి సన్నగా తరగాలి. తరవాత అందులో గోధుమ పిండి, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, వంటసోడా, ఉప్పు, అల్లంవెల్లుల్లిముద్ద, కారం అన్నీ వేసి కలపాలి.

2.అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలక రించి మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.

3.ఇప్పుడు బాణలిలో నూనె అంతా వంపేసి అడుగున కొద్దిగా ఉంచి, ఉల్లిముక్కలు, ఉల్లికాడల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.

4. తరవాత చిల్లీసాస్, టొమాటో సాస్, కొత్తిమీర తురుము వేసి కలిపి అందులోనే మంచూరియాలను  వేసి ఓ నిమిషం ఉడికించి దించాలి.

వ్యాఖ్యానించండి