కావలసిన పదార్థాలు:-
నాటుకోడి – 1/2 కేజీ
అల్లం వెల్లుల్లి ముద్ద – 2 tsp
నూనె – 3 tsp
ఉల్లి తరుగు –1/4 కప్పు
తరిగిన పచ్చి మిర్చి – 6
మిరియాల పొడి – 1/2 tsp
జాజికాయ చిన్న ముక్క
గరం మసాలా – 1tsp
జీలకర్ర పొడి – 1tsp
ధనియాల పొడి – 2 tsp
కారం – 2 tsp
ఉప్పు – తగినంత
జీడిపప్పులు – 50 gram
టొమాటో తరుగు – 1
పుదీనా – ఒక కట్ట
కొత్తిమీర – చిన్న కట్ట
నిమ్మ రసం – 1tsp
కరివేపాకు -2 రెమ్మలు
జీలకర్ర – 1/2tsp
తయారీ విధానం:-
1.నాటుకోడి ముక్కలను శుభ్రం చేసి నీళ్లతో కడగాలి
2.స్టౌ మీద కుకర్ ఉంచి, కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, గరం మసాలా, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, టొమాటో తరుగు, జీడి పప్పులు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి.
3.చికెన్ ముక్కలను కూడా వేసి వేయించాలి.
4.ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
5.ఉడికించిన ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలియబెట్టాలి.
6.చివరగా నిమ్మ రసం, కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి దింపి, వేడి వేడిగా అందించాలి.

వ్యాఖ్యానించండి