మునగాకు పొడి

మునగాకు –  4 కప్పులు

జీలకర్ర –   2tsp

సెనగపప్పు -1 కప్

పెసరపప్పు -1/2కప్
దనియాలు – 4tsp

ఎండుమిర్చి -12

చింతపండు కొద్దిగా

బెల్లం  చిన్నముక్క

మెంతులు –  2 tsp

పసుపు చిటికెడు

ఉప్పు  తగినంత

నూనె తగినంత

తయారుచేసే విధానం

1. ముందుగా బాణలిలో సెనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు విడివిడిగా వేయించి తీయాలి. ఇవి చల్లారాక అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి.

2. తరవాత అందులోనే కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించి తీసి చింతపండు వేయాలి. అది కూడా కాస్త వేయించాక తీసేసి మునగాకు వేయించాలి.

3.ఇప్పుడు మిక్సీలో చింతపండు, ఎండుమిర్చి, మునగాకు, పసుపు, ఉప్పు, బెల్లం కలిపి గ్రైండ్ చేయాలి. తరవాత అందులోనే మళ్లీ ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసి మళ్లీ ఓసారి గ్రైండ్ చేసి తీయాలి

వ్యాఖ్యానించండి