మామిడికాయ రసం

కావలసిన పదార్థాలు:-

కందిపప్పు -2 tbsp

పచ్చిమామిడికాయ(చిన్నది) – 1

టొమాటోలు – 2

ఉప్పు తగినంత

కరివేపాకు – 4 రెబ్బలు

ఎండుమిర్చి – 2

మిరియాలు – 1 /2tsp

దనియాలు – 1tsp

జీలకర్ర – 1 tsp

అల్లంతురుము – 1 tsp

వెల్లుల్లితురుము – 1tsp

ఆవాలు – 1/2tsp

పసుపు – 1/2 tsp

నూనె – 4tsp

తయారుచేసే విధానం:
1.బాణలిలో మిరియాలు, దనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి.
2.మామిడికాయ తొక్కు తీసి ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉడికించి మెత్తని గుజ్జులా చేయాలి. కందిపప్పును కూడా విడిగా ఉడికించాలి.

3.టొమాటోల్ని ఉడికించి గుజ్జులా చేయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి తురుము, రసం పొడి వేసి నీళ్లు పోసి మరిగించి పలుచని బట్టతో వడకట్టాలి. దీనికి మామిడికాయ గుజ్జు, ఉడికించి మెదిపిన పప్పు వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి ఐదు నిమిషాలు మరిగించాలి..
4.బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ వేసి తాలింపు చేసి రసంలో కలిపితే సరి.

వ్యాఖ్యానించండి