మ్యాంగో కస్టర్డ్ షేక్

కావలసిన పదార్థాలు:-
చిక్కని పాలు – 1లీటరు,
కస్టర్డ్ పొడి -2Tbsp
కాచి చల్లార్చిన పాలు -1/4 కప్
చక్కెర – 1/4 కప్
యాలకులపొడి – 1/4Tsp
సబ్జాగింజలు -1 స్పూన్(పావుకప్పు నీళ్లల్లో నానబెట్టుకోవాలి)
ఉడికించిన సగ్గు బియ్యం – 1/2 కప్
మామిడిపండు గుజ్జు -1 కప్పు,
మామిడిపండు ముక్కలు -1 కప్పు,
బాదం పలుకులు – 2 tbsp
పిస్తా పలుకులు – 2 tbsp
పిస్తా పలుకులు – 2 tbsp

తయారీ విధానం:-
1.ముందుగా కాచి చల్లార్చిన పాలల్లో చక్కెర పొడి, కస్టర్డ్ కలిపి పెట్టుకోవాలి.

2.స్టవీమీద గిన్నె పెట్టి పాలు పోయాలి. అవి వేడెక్కుతున్న వేడెక్కుతున్నప్పుడు కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి స్టవ్ సిమ్ లో పెట్టాలి. మధ్యమధ్య కలుపుతూ ఉండి పాలు కాస్త చిక్కగా అయ్యాయ నుకున్నాక దింపేయాలి.

3.ఈ కస్టర్డ్ మిశ్రమం పూర్తిగా చల్లారాక మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్క టిగా వేసుకుని అన్నింటినీ మరోసారి కలుపుకో వాలి.

4.దీన్ని గంటసేపు ప్రిజ్లో పెడితే చాలు… చల్లచల్లని మ్యాంగో కస్టర్డ్ షేక్ రెడీ.

వ్యాఖ్యానించండి