అటుకుల పులిహోర

కావల్సిన పదార్థాలు :-

అటుకులు- 2 కప్పులు

కొబ్బరిపాలు-1 కప్పు

నిమ్మకాయ – 1

పోపు దినుసులు – తగినన్ని

వేరుసెనగలు – 3 చెంచాలు

కరివే పాకు – 4రెబ్బలు

నూనె – 4 చెంచాలు

పచ్చిమిర్చి – 5

ఎండు మిర్చి – 5

ఉప్పు – రుచికి తగినంత

ఉల్లిపాయ – 1

తయారీ విధానం:-

1.కొబ్బరిపాలలో అటుకుల్ని పదినిమిషాలు నానబెట్టుకోవాలి.

2.బాణ లిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక తాలింపు దినుసులు, పచ్చి మిర్చి, కరివేపాకు, వేరుసె నగలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేయాలి.

3.అవి మగ్గాక నానిన అటుకులు, తగినంత ఉప్పు చేర్చి కలియతిప్పి దింపేయాలి.

4.వేరే పళ్లెంలోకి తీసుకొని నిమ్మరసం పిండి పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలతో అలంకరించుకొంటే సరిపోతుంది.

వ్యాఖ్యానించండి