ఫ్రైడ్ రైస్ బాల్స్

కావలసినవి:-

అన్నం – 3 కప్పులు

మైదాపిండి – అర కప్పు,

గుడ్లు – 4

పాలు – 2 టీ స్పూన్లు,

సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్

క్యారెట్ – 1 (చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి)

రెడ్ క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు – తగినంత,

బ్రెడ్ పౌడర్ – 1 కప్పు

నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:-

1. ముందుగా ఒక బౌల్లో అన్నం, మైదాపిండి, రెండు గుడ్లు, సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి.

2.ఇప్పుడు క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

3.ఇప్పుడు ఒక బౌల్లో 2 గుడ్లు+పాలు, మరో బౌల్లో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఆ బాల్స్ నీ గుడ్లు+పాల మిశ్రమంలో ముంచి, వాటికి బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించాలి.

4.టమాటా సాస్ తో కలిపి సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.

వ్యాఖ్యానించండి