కావలసినవి:
పనీర్ తురుము – 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు
క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్ స్పూన్
చీజ్ – 2 టేబుల్ స్పూన్లు
బంగాళదుంప ముక్కలు -1 కప్పు (మెత్తగా ఉడికినవి)
మసాలా పొడి – 1 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
గుడ్డు – 1,
పాలు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత,
బ్రెడ్ పీసులు – 6
సాస్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
నూనె – కొద్దిగా
తయారీ విధానం:-
1.ముందుగా బ్రెడ్ పీసులను చిన్న బౌల్ ఉపయోగించి గుండ్రంగా కట్ చేసుకోవాలి.
2.తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, చీజ్, మసాలా పొడి, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
3.ఇప్పుడు ఒక గుండ్రటి బ్రెడ్ పీస్ తీసుకుని దానిపైన పనీర్ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో గుండ్రటి బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి.
4.ఇప్పుడు ఒక బౌల్లో గుడ్డు-పాలు వేసుకుని బాగా కలుసుకుని అందులో ఈ శాండ్విచ్ని ముంచి దోరగా నూనెపై వేయించాలి.
5.ఇప్పుడు ఆ శాండ్విచ్ని సగానికి కోసి… చిత్రంలో కనిపిస్తున్న విధంగా వాటిపైన సాస్, బంగాళదుంప ముక్కలు వేసుకోవచ్చు.
6.అభిరుచిని బట్టి కారప్పుస వంటివి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.

వ్యాఖ్యానించండి