కావలసిన పదార్థాలు:-
శనగపప్పు, కందిపప్పు – 4 టేబుల్ స్పూన్లు చొప్పన (2 గంటల పాటు నానబెట్టాలి)
ఎండుమిర్చి – 5
జీలకర్ర – అర టీ స్పూన్
ఉల్లిపాయ – 1,
పచ్చిమిర్చి – 2 (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
బీట్రూట్ తురుము – 2 కప్పులు
కరివేపాకు – 2 రెమ్మలు
అల్లం పేస్ట్ – అర టీ స్పూన్
ఉప్పు – సరిపడ
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:-
1.ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో శనగపప్పు కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా చేసుకోవాలి.
2.ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, కరివేపాకు, బీట్ రూట్ తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి.
3 ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాల్స్ లా చేసుకుని వడల్లా చేతులతో నొక్కి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి

వ్యాఖ్యానించండి